మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 మార్చి 2023 (19:03 IST)

తెలంగాణలో మహిళా ఆరోగ్య పథకం: ఒక్క పైసా కూడా ఇవ్వక్కర్లేదు

harish rao
ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం ఆ బీమా పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ ఆరోగ్య మహిళ పథకం కింద వంద ఆస్పత్రులు ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఆరోగ్య మహిళా కేంద్రాల్లో మహిళా సిబ్బంది మాత్రమే వుంటారని మంత్రి స్పష్టం చేశారు. 
 
ఈ స్కీమ్‌లో ఎనిమిది రకాల చికిత్సలు అందుబాటులో వుంటాయని వెల్లడించారు. మహిళలు వారి ఇబ్బందులను స్వేచ్ఛగా డాక్టర్లకు చెప్పుకోవచ్చన్నారు. ఆస్పత్రికి వచ్చిన మహిళలకు డాక్టర్లు వైద్యం, పరీక్షలు, అవసరమైన మందులను కూడా ఉచితంగా ఇక్కడే ఇస్తారని తెలిపారు. 
 
ఒక్క పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. పెద్ద పెద్ద ఆస్పత్రుల్లో లభించే వైద్య సదుపాయాలు ఈ కేంద్రాల్లో లభిస్తాయని చెప్పుకొచ్చారు.