శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: బుధవారం, 11 నవంబరు 2020 (11:34 IST)

తెలంగాణ కరోనా అప్‌డేట్స్, కొత్తగా 1,196 పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ తగ్గడం లేదు. దీనికి తోడు రోజురోజుకి కొత్త కేసులు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఈనాటి వివరాల ప్రకారం రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,196 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఐదుగురు కరోనాతో తమ ప్రాణాలను కోల్పోయారు.
 
ఇదిలా ఉండగా 1,745 మంది కరోనా బారి నుండి కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,53,651కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,34,234మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక మృతుల సంఖ్య మొత్తం 1390కి చేరింది.
 
ప్రస్తుతం 18,027 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 15,205 మంది హోం క్వారంటైన్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం కొత్తగా 192 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 121 కేసులు నిర్ధారణ అయ్యింది.