శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Modified: మంగళవారం, 10 నవంబరు 2020 (18:47 IST)

అత్యధిక విరాళాలతో నెంబర్ 1గా నిలిచిన విప్రో అధినేత అజిమ్ ప్రేమ్ జీ

మానవ జీవింలో సంపాదించడం ఒక ఎత్తైతే, సమాజం మేలు కోసం ఆ సంపాదనను దాతృత్వ సేవకు వినియోగించడం మరో ఎత్తు. ఈ కోవలో చూస్తే విప్రో అధినేత 75 ఏళ్ల అజిమ్ ప్రేమ్‌జీ ఎవరికీ అందనంత ఎత్తులో నిలుస్తారు. తాజా గణాంకాల ప్రకారం కూడా అదే చెబుతున్నారు. ఎడెల్ గైవ్ హురూన్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం అత్యధిక విరాళాలు అందించిన వారిలో అజిమ్ ప్రేమ్ జీ అగ్రస్థానంలో ఉన్నారు.
 
ఆయన ఈ ఏడాది రూ.7,904 కోట్లను చారిటీలకు విరాళంగా ఇచ్చారు. అజిమ్ ప్రేమ్ జీ విప్రోలో తన 34 శాతం వాటాను సమాజ సేవ కోసం అర్పించారు. ప్రస్తుతం ఆ వాటా విలువ రూ.52,750 కోట్లు. కాగా ఎడెల్ గైవ్ హురూన్ ఇండియా జాబితాలో ప్రేమ్ జీ తర్వాత రెండో స్థానంలో హెచ్‌సీ‌ఎల్ అధినేత శివ్ నాడార్, మూడో స్థానంలో రిలయన్స్ కింగ్ ముఖేశ్ అంబానీ, నాలుగో స్థానంలో బిర్లా దిగ్గజం కుమార మంగళం బిర్లా, ఐదో స్థానంలో వేదాంతా గ్రూప్ అనిల్ అగర్వాల్ ఉన్నారు.
 
2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి మధ్య కాలంలో ఇచ్చిన విరాళాల ఆధారంగా ఈ జాబితా రూపొందించారు. ఈ ఏడాది 112 మందికి ఈ జాబితాలో స్థానం కల్పించారు. అత్యధిక విరాళాలు ఇచ్చిన మహిళగా రోహిణి నీలేకని, పిన్న వయస్సు దాతృత్వకర్తగా బిన్నీ బన్సాల్ ఈ జాబితాలో ఉన్నారు.