సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : శనివారం, 4 మార్చి 2017 (09:33 IST)

తమకూ ఒక కేసీఆర్‌ కావాలని ఏపీ ప్రజలు భావిస్తున్నారు : ఈటల రాజేందర్

తమకూ ఒక కేసీఆర్ కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆయన సచివాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తమకూ ఒక కేసీఆర్‌ ఉంటే బాగుండునని

తమకూ ఒక కేసీఆర్ కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆయన సచివాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తమకూ ఒక కేసీఆర్‌ ఉంటే బాగుండునని ఏపీ ప్రజలు భావిస్తున్నారన్నారు. 
 
తెలంగాణ ప్రభుత్వం పని, కేసీఆర్ పరిపాలనతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోటీ పడాలని, కుట్రలు, కుతంత్రాలు చేయవద్దంటూ ధ్వజమెత్తారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. చిన్న రాష్ట్రాలే అభివృద్ధిలో ముందున్నాయని ఈటల గుర్తు చేశారు. గుజరాత్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు. 
 
ఇరు రాష్ట్రాల ప్రజలూ చంద్రబాబు మాటతీరు, మొసలి కన్నీరును చూసి అసహ్యించుకుంటున్నారన్నారు. ఏపీ, తెలంగాణలు విడిపోయి అభివృద్ధి చెందుతున్న తరుణంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడడం అభ్యంతరకరమని ఈటల వ్యాఖ్యానించారు.