గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: గురువారం, 11 జూన్ 2020 (22:14 IST)

నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ గవర్నర్

నటసింహ నందమూరి బాలకృష్ణ 60వ జన్మదినం సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
గవర్నర్ శుభాకాంక్షలు తెలియజేయడంపై బాలయ్య స్పందిస్తూ... నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారి నుండి జన్మదిన శుభాకాంక్షలు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.