1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 12 ఆగస్టు 2014 (12:31 IST)

టి సమగ్ర సర్వే.. 18 డాక్యుమెంట్లు చూపించకుంటే అంతేమరి?

ఈనెల 19వ తేదీన తెలంగాణ ప్రభుత్వం సమగ్ర సర్వేను నిర్వహించనుంది. ఈ సర్వేలో పాల్గొనే అధికారుల(ఎన్యూమరేటర్లు)కు ప్రజలు 18 డాక్యుమెంట్లను చూపించాల్సి వుంటుంది. వీటిని అధికారులు నిశితంగా పరిశీలించినట్టు తమ రికార్డుల్లో ఆ కుటుంబ వివరాలను నమోదు చేసుకుంటారు. ఒక వేళ ఈ డాక్యుమెంట్లు లేనివారి పరిస్థితేంటని పలు కుటుంబీలుకు ప్రశ్నిస్తున్నారు. ఈ సర్వే అధికారులు పరిశీలించనున్న డాక్యుమెంట్ల వివరాలు ఇవే. 
 
1. ప్రాపర్టీ టాక్స్ రిసీప్ట్, 2. వాటర్ బిల్, 3. ఎలక్ట్రిసిటీ బిల్, 4. ఆధార్ కార్డ్, 5. ఎల్ పీజీ కనెక్షన్ కాపీ, 6. బర్త్ సర్టిఫికేట్, 7. వాహనాల ఆర్.సి బుక్, 8. రేషన్ కార్డ్, 9. వోటర్ కార్డ్, 10. పాన్ కార్డ్, 11. మొబైల్ ఫోన్ బిల్స్, 12. పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ పాస్ బుక్, 13. కుల ధ్రువీకరణ పత్రం, 14. వికలాంగ ధ్రువీకరణ పత్రం(డిసేబుల్డ్ సర్టిఫికేట్), 15. బలహీన వర్గాల ఇళ్ల సర్టిఫికెట్(వీకర్ సెక్షన్ హౌసింగ్ సర్టిఫికెట్), 16. పట్టాదారు పాస్ బుక్, 17. పెన్షన్ పాస్ బుక్, 18. ప్రాపర్టీ డాక్యుమెంట్లను సర్వే అధికారులకు చూపించాల్సి వుంటుంది.