శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By chakri
Last Updated : శుక్రవారం, 21 జులై 2017 (17:04 IST)

మిస్ వరల్డ్ కెనడా 2017 ఫైనల్స్‌లో తెలుగమ్మాయి

మన తెలుగమ్మాయి కెనడా అందాలపోటీల్లో రాణిస్తోంది. కెనడాలో నిర్వహించే ప్రతిష్టాత్మక "మిస్ వరల్డ్ కెనడా 2017" పోటీల్లో తెలుగమ్మాయి శ్రావ్య ఫైనల్‌కు అర్హత సాధించింది.

మన తెలుగమ్మాయి కెనడా అందాల పోటీల్లో రాణిస్తోంది. కెనడాలో నిర్వహించే ప్రతిష్టాత్మక "మిస్ వరల్డ్ కెనడా 2017" పోటీల్లో తెలుగమ్మాయి శ్రావ్య ఫైనల్‌కు అర్హత సాధించింది.
 
శ్రావ్య స్వస్థలం ఖమ్మం జిల్లా అశ్వారావు పేట. పదేళ్ల వయస్సు వరకు అదిలాబాద్‌లోనే చదువుకున్న శ్రావ్య, ఆ తర్వాత తన కుటుంబంతో పాటు కెనడాకు వలస వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమె యూనివర్శిటీ ఆఫ్ ఆల్బెట్రాలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. 
 
కెనడాలోనే జరిగిన "మిస్ నార్తర్న్ ఆల్బెర్టా వరల్డ్" పోటీల్లో పాల్గొని కిరీటం దక్కించుకుంది. దీనితో తన ఆత్మవిశ్వాసం రెట్టింపై టొరొంటోలో జరిగే "మిస్ వరల్డ్ కెనడా 2017" పోటీల్లో పాల్గొనడానికి ప్రయత్నించి, అర్హత సాధించింది.
 
ఇప్పటివరకు ప్రతి కేటగిరీలో విజయం సాధిస్తూ చివరి దశకు చేరుకుంది. శ్రావ్య ఫైనల్లో కూడా విజయం సాధిస్తుందని ఆమె కుటుంబ సభ్యులు ధీమా వ్యక్తం చేశారు. శ్రావ్యకు ఓటు వేయాలనుకున్న వారు మిస్ వరల్డ్ కెనడా వెబ్‌సైట్‌కెళ్లి ఓటు వేయొచ్చని పేర్కొన్నారు.