ముత్తాతల కాలంనాటి భవనం నేలకూలింది... ఎక్కడ?
హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉంటూ వచ్చిన ముత్తాతల కాలంనాటి భవనం నేలకూలింది. ఆ భవనం పేరు 'ది రాయల్ హోటల్'. హైదరాబాద్ నగరం నడిబొడ్డున నాంపల్లిలో ఉన్న రాయల్ హోటల్‌ను స్వాతంత్ర్యానికి పూర్వమే అంటే 90 ఏళ్
హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉంటూ వచ్చిన ముత్తాతల కాలంనాటి భవనం నేలకూలింది. ఆ భవనం పేరు 'ది రాయల్ హోటల్'. హైదరాబాద్ నగరం నడిబొడ్డున నాంపల్లిలో ఉన్న రాయల్ హోటల్‌ను స్వాతంత్ర్యానికి పూర్వమే అంటే 90 ఏళ్ల క్రితం నిర్మించారు. ఈ చారిత్రక సౌధం మెట్రో పనుల్లో భాగంగా కూల్చివేశారు.
సంపూర్ణ భారతావనిలో భాగంగా ఆనాడు పాకిస్థాన్ ప్రాంతానికి చెందిన సింధీ కులస్తుడు శంకర్ దాస్ ఆరు గదులతో ప్రారంభించిన ఈ హోటల్‌ను 60 గదులకు విస్తరించారు. అప్పట్లో రోజుకు గది అద్దె అర్థ రూపాయ ఉండేది. ప్రస్తుతం 600 రూపాయలుగా వసూలు చేస్తున్నారు. ఆనాడు ప్రముఖులు, సంపన్నులు ఈ హోటల్‌లో బస చేశారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌కు కూతవేటు దూరంలో ది రాయల్ హోటల్ ఉండటంతో సందర్శకులతో నిత్యం కళకళలాడుతూ కనిపించేది.
ఈ హోటల్ యజమాని ప్రకాష్ ఏ బొలాకి స్పందిస్తూ.. ‘ది రాయల్’ హోటల్‌ను నాలుగు తరాల నుంచి నడిపిస్తున్నామన్నారు. ముత్తాతల నుంచి ఈ హోటల్ తమకు వారసత్వంగా లభించిందన్నారు. కానీ, ఈ హోటల్ భవనాలను కూల్చివేసే పరిస్థితులు వస్తాయని, 60 గదుల తమ హోటల్‌ను కూల్చివేస్తారని తాము ఎన్నడూ ఊహించలేదన్నారు.