శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: బుధవారం, 27 జనవరి 2021 (11:19 IST)

మా అక్క భర్త లేక బాధపడుతోంది, ఆమె కోరిక తీర్చమన్న భార్య, ఆ తర్వాత?

అతనికి వివాహమైంది. ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. అన్యోన్యంగా సాగిపోతున్న కుటుంబం. అయితే ఉన్నట్లుండి ఆ కుటుంబంలో అలజడి. వివాహేతర సంబంధంతో చివరకు కటాకటాలపాలయ్యాడు. వివాహేతర సంబంధం తప్పని చెప్పాల్సిన భార్యే అందుకు సహకరించింది. చివరకు ఆమె కూడా కటకటాల పాలైంది. 
 
వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని పన్యానాయక్ తండాకు చెందిన బానోతు కమ్లీ, సజ్జన్ నాయక్‌కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కూతురు వనితకు జనగామ జిల్లా దేవరుప్పుల మండంలోని మాదాపురం గ్రామ సమీపంలోని పెద్ద తండాకు చెందిన శంకర్ నాయక్‌కు ఇచ్చి వివాహం చేశారు. 
 
గత నెల క్రితం వనిత భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో వారి కుటుంబం ఒంటరిగా ఉంటోంది. ఉన్న డబ్బులతో కుటుంబాన్ని లాగుతోంద వనిత. కానీ భర్త లేని లోటును మాత్రం తట్టుకోలేక పోయింది. చెల్లెలు సునీతకు ఫోన్ చేసి తన బాధను చెప్పుకునేది.
 
అయితే అక్క వనిత పడుతున్న బాధను చూసిన సునీత భర్త రాజును ఉసిగొల్పింది. నువ్వే మా అక్కకు దిక్కు అంటూ చెప్పుకొచ్చింది. ఆమెతో పడుకోమంటూ చెప్పింది. అసలే మగాడు. అందులోను భార్య చెబితే వద్దంటాడా? శారీరక సుఖాన్ని వదులుకుంటాడా. రెచ్చిపోయాడు. వనిత దగ్గరకు వెళ్ళడం శారీరకంగా కలవడం మొదలుపెట్టాడు. 
 
ఆమెతో బహిరంగంగా షికార్లు చేయడం కూడా మొదలుపెట్టాడు. భార్యే ఆ పని చేయమంటే ఇంక అడ్డు ఏముంటుంది. కానీ హఠాత్తుగా వనితపై రాజుకు అనుమానం వచ్చింది. తనతో కాకుండా ఆమె వేరొకరితో సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్నాడు. తనలాగే ఇంకెవరో వ్యక్తితో ఆమె సంబంధం సాగిస్తుందని అనుమానపడి ఆమెని రెండు రోజుల క్రితం బైక్ పైన ఊరి బయటకు తీసుకెళ్ళాడు. స్కూటర్ లోని కిట్‌లో వస్తువుల్లో స్కూ డ్రైవర్‌ను బయటకు తీశాడు. నిజం చెప్పు. నువ్వు ఎవరితోను కలుస్తున్నావని బెదిరించాడు. నిజం చెప్పకుంటే పొడిచేస్తానన్నాడు. ఆమె ఎవరితోను కలవలేదని చెప్పినా వినలేదు.
 
ఐనా వినకుండా ఆగ్రహంతో ఆమె కడుపులో స్కూడ్రైవర్‌ను దింపాడు. ఆమె అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయింది. ఆ మృతదేహాన్ని పక్కనే ఉన్న చెరువులో పడేసి వెళ్ళిపోయాడు. నిన్న ఉదయం స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణలో అన్ని విషయాలు బయటపడ్డాయి. నిందితులు రాజుతో పాటు సహకరించిన భార్యను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.