శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శనివారం, 15 జులై 2017 (15:14 IST)

అకున్... డ్రగ్స్ రాయుళ్ల తాటతీయ్... శెలవు రద్దు చేసిన టి.ప్రభుత్వం

ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ శెలవుపై వెళ్లనున్నారన్న నేపధ్యంలో డ్రగ్స్ దందాపై ఆయనపై ఒత్తిడి పెరిగిందనీ, ప్రభుత్వం ఒత్తిడి కారణంగా ఆయన సెలవుపై వెళుతున్నారంటూ మీడియాలో ప్రచారం జరిగింది. దీనితో స్పందించిన తెలంగాణ ప్రభుత్వం అకున్ సెలవును రద్దు చే

ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ శెలవుపై వెళ్లనున్నారన్న నేపధ్యంలో డ్రగ్స్ దందాపై ఆయనపై ఒత్తిడి పెరిగిందనీ, ప్రభుత్వం ఒత్తిడి కారణంగా ఆయన సెలవుపై వెళుతున్నారంటూ మీడియాలో ప్రచారం జరిగింది. దీనితో స్పందించిన తెలంగాణ ప్రభుత్వం అకున్ సెలవును రద్దు చేసింది. 
 
డ్రగ్స్ కేసు కీలక దశలో వుండటంతో ఆయన సెలవు తీసుకుంటే సంకేతాలు తేడాగా వుంటాయనీ, ఇప్పటికే ఇలాంటి ప్రచారం జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నది. దీనితో అకున్ సబర్వాల్ తన సెలవును రద్దు చేసుకుని మత్తు రాయుళ్ల పని పట్టనున్నారు.
 
మరోవైపు డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు పలు వ్యాపార సంస్థలకు చెందిన బడా వ్యక్తులు కూడా వున్నట్లు తెలుస్తోంది. వీరికి నోటీసులు ఇచ్చి విచారణ చేసేందుకు అకున్ రంగంలోకి దిగినట్లు చెపుతున్నారు.