శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 నవంబరు 2021 (18:52 IST)

జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) అధికారులపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలోని బేగంపేట్ టూరిజం ప్లాజాలో దిశ సమావేశం గురువారం జరిగింది. 
 
దీనికి కిషన్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై చర్చించారు. అలాంటి కీలకమైన సమావేశానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ హాజరుకాలేదు. 
 
ఈ విషయం తెలియగానే మంత్రి ఆగ్రహించారు. జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లేకుండా ఈ సమావేశం నిర్వహించి ప్రయోజనం ఎందుకని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వారిద్దరూ హాజరుకావడంతో దిశ సమావేశం యధావిధిగా కొనసాగింది.