గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 నవంబరు 2021 (11:05 IST)

నేడు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద రైతుల మహాధర్నా

వరికి కనీస మద్దతు ధర కల్పించాలని, మూడు వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసేలా పార్లమెంట్ ఉభయసభల్లో తొలి రోజునే తీర్మానం చేయాలన్న ప్రధాన డిమాండ్లతో అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటి గురువారం ఢిల్లీ సరిహద్దుల్లో మహాధర్నా చేయనుంది. ఈ మహాధర్నా భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగనుంది. 
 
ఇదే అంశంపై అ సంస్థ అధికార ప్రతినిధి కాకేష్ తికాయత్ మాట్లాడుతూ, అఖిల భారత్ రైతు పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద గురువారం మహాధర్నా సాగుతుందన్నారు. 
 
వరి ధాన్యానికి కనీస మద్దతు ధర చట్ట సాధన, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, రైతులపై పెట్టిన అక్రమ కేసుల ఎత్తివేత, ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించి, శాశ్వత ఉపాధి కల్పించాలని, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పించాలన్నవి తమ ప్రధాన డిమాండ్లు అని చెప్పారు.