గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : శనివారం, 29 ఏప్రియల్ 2017 (13:31 IST)

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు కన్నుమూత.. సాగునీటి రంగంలో 34 ఏళ్లు?

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు మరణించారు. సాగునీటి రంగ నిపుణులైన విద్యాసాగర్ రావు మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ విద్యాసాగర్ రావు కుటుంబానిక

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు మరణించారు. సాగునీటి రంగ నిపుణులైన విద్యాసాగర్ రావు మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ విద్యాసాగర్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తనకు పెద్దన్నలా విద్యాసాగర్ రావు వ్యవహరించేవారన్నారు. 
 
బంగారు తెలంగాణ సాధించే క్రమంలో మనతో పాటు ఉండాల్సిన విద్యాసాగర్ రావు... అర్థాంతరంగా మనల్ని వదిలి వెళ్లిపోవడం బాధాకరమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆయన మరణం తెలంగాణ జాతికి తీరని లోటు అని అన్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందని అనుకున్నానని.. కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
కాగా నీటిపారుద‌ల రంగ నిపుణుడు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీరు, రాష్ట్ర నీటిపారుద‌ల స‌ల‌హాదారు ఆర్ విద్యాసాగ‌ర్‌రావు స్వగ్రామం న‌ల్లగొండ జిల్లా ఓల్డ్ సూర్యాపేట తాలూకాలోని జాజిరెడ్డి గూడెం. ఈ మారుమూల గ్రామం నుంచి తొలి పట్టభద్రుడైన విద్యాసాగర్ రావు 34 సంవత్సరాల పాటు కేంద్ర జల సంఘంలోనే విధులు నిర్వహించడంతో పాటు ఆయన దేశ వ్యాప్తంగా జల వనరుల అంశంపై అపారమైన అనుభవం గడించారు. చిన్నప్పటి నుంచి కథలు రాయడం ఈయన అలవాటు. చిన్నప్పుడు గిరీశం అనే కలం పేరుతో ఆయన రాసిన రచనలు పత్రికల్లో ప్రచురితమైనాయి.