గురువారం, 16 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2022 (10:12 IST)

హైదరాబాద్ వజీర్ ఎక్స్‌లో ఈడీ సోదాలు

wazirx - ed raids
హైదరాబాద్ నగరంలోని వజీర్ ఎక్స్ కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం మరోమారు సోదాలకు దిగారు. లోన్ యాప్స్ కేసులో వజీర్ ఎక్స్ క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. అలాగే, వజీర్ ఎక్స్ డైరెక్టర్ల గృహాల్లోనూ తనిఖీలు సాగుతున్నాయి. 
 
సంస్థ డైరెక్టర్లు నిశ్చల్ శెట్టి, సమీర్ హనుమాన్‌లకు గతంలో ఈడీ అధికారులు తాఖీదులు పంపించింది. బిట్ కాయిన్, ట్రాస్, లిట్‌కాయిన్, రిప్పల్ వంటి డిజిటల్ కరెన్సీల రూపంలో రూ.2790 కోట్లకు సంబంధించిన లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు వజీర్ ఎక్స్ కంపెనీపై ఆరోపణలు ఉన్నాయి. వీటిపైనే ఇపుడు ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.