శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 జనవరి 2023 (21:59 IST)

పవన్ ఇంటి ముందు మహిళ హంగామా.. దుస్తులు తీసేస్తూ..

pawan kalyan
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇంటి ముందు ఓ మహిళ హంగామా చేసింది. పవన్ నివాసం వద్ద జాయిస్ కమల ఆందోళన చేపట్టింది. పవన్ కల్యాణ్‌ను కలవాలంటూ సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. 
 
తన దుస్తులు తీసేస్తూ వారిపై రాళ్లతో దాడి చేసింది. పవన్ కలవాలని ఆమె చెప్పడంతో సెక్యూరిటీ సిబ్బంది అంగీకరించలేదు. దీంతో వాళ్లపై రాళ్లు రువ్వింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. 
 
కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఆమెను స్టేషన్‌కు తరలించారు. పోలీసులు జరిపిన దర్యాప్తులో ఆమె తమిళనాడు, మదురైకి చెందిందని తేలింది. ఆమెకు మనస్థిమితం లేకపోవడంతో ఇలా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు. 
 
గతంలో హీరో సాయితేజ్ ఇంటి ఎదుట కూడా ఇలాగే హంగామా సృష్టించినట్టు తెలిసింది. అప్పట్లో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రానికి తరలించారు.