అబ్ రామ్‌తో కలిసి దీపికకు నటించాలని ఉందట: షారుక్ కామెంట్
షారూఖ్ లేటెస్ట్ హిట్ సినిమా 'హ్యాపీ న్యూ ఇయర్' ద్వారా ఆయన చిన్న కుమారుడు అబ్ రామ్ వెండితెర అరంగేట్రం చేశాడు. దీంతో, బాలీవుడ్ ప్రముఖులంతా షారూఖ్ కుమారుడి ఎంట్రీని అభినందించారు.
అయితే అన్నింట్లోకంటే దీపికా పదుకునే ప్రశంసే ఉత్తమమైనదని షారూఖ్ ఖాన్ పేర్కొన్నాడు. అబ్ రామ్ చూడముచ్చటగా ఉన్నాడని, తరువాతి సినిమాలో అబ్ రామ్‌తో నటించాలని ఉందని దీపికా చెప్పిందని షారూఖ్ సక్సెస్ మీట్‌లో తెలిపాడు.
కాగా, షారూఖ్ తాజా సినిమా 'హ్యాపీ న్యూ ఇయర్' వారాంతానికి 108 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.