1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 16 మే 2024 (18:28 IST)

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

chandrababu
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కేంద్రం నుంచి ముఖ్య భద్రతాధికారురాలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం, కరకట్ట వద్ద చంద్రబాబు నివాసం, గన్నవరం విమానాశ్రయం మార్గాలను పరిశీలించారు. చంద్రబాబుకి భద్రతకు అదనంగా 12x12 రెండు బృందాలుగా 24 మంది బ్లాక్ కాట్ కమెండోలను కేటాయించారు. చంద్రబాబుకి భద్రత పెంచుతూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
 
చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర లోని మహాలక్ష్మి అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకుని పూజాది కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన షిర్డీ సాయిబాబా దర్శనం చేసుకున్నారు.