బుధవారం, 13 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 27 ఆగస్టు 2014 (17:08 IST)

'మనోహరుడు' ఆడియో ఫంక్షన్‌కి హాలీవుడ్‌ హీరో అర్నాల్డ్‌

చియాన్‌ విక్రమ్‌ హీరోగా ఆస్కార్‌ ఫిలిమ్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై గ్రేట్‌ శంకర్‌ దర్శకత్వంలో ఆస్కార్‌ రవిచంద్ర నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఐ'. 180 కోట్ల భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్‌ వేల్యూస్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా వరల్డ్‌వైడ్‌గా విడుదలవుతున్న విషయం తెలిసిందే. కాగా, ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ సెప్టెంబర్‌ 15న చాలా గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. ఈ ఆడియో ఫంక్షన్‌కి హాలీవుడ్‌ హీరో అర్నాల్డ్‌ ష్వావెర్జనెగర్‌ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. 
 
'మనోహరుడు' ఆడియో ఫంక్షన్‌ విశేషాలను నిర్మాత ఆస్కార్‌ రవిచంద్రన్‌ తెలియజేస్తూ - ''మా ఆస్కార్‌ ఫిలిం ప్రై. లిమెటెడ్‌ బేనర్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా 180 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న 'ఐ' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 20 వేల థియేటర్లలో దీపావళి కానుకగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో 'మనోహరుడు'గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ చాలా గ్రాండ్‌ లెవల్‌లో చేయబోతున్నాం. 
 
ఈ ఫంక్షన్‌కి హాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అర్నాల్డ్‌ ష్వావెర్జనెగర్‌ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. నేను, నా సోదరుడు, ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ అయిన రమేష్‌బాబు అర్నాల్డ్‌ను కలిసి ఈ చిత్రాన్ని పర్సనల్‌గా చూపించడం జరిగింది. ఈ చిత్రాన్ని చూసి ఆయన ఎంతో థ్రిల్‌ ఫీల్‌ అయ్యారు. ఇది ఒక ఎక్స్‌ట్రార్డినరీ ఫిలిం అని, విజువల్‌ వండర్‌ అని, చాలా అద్భుతంగా తీశారని ఇండియన్‌ జేమ్స్‌ కామరూన్‌ శంకర్‌ను అభినందించారు. 
 
మా సినిమా ఆడియో ఫంక్షన్‌కు ముఖ్యఅతిథిగా అర్నాల్డ్‌ను ఆహ్వానించాం. దానికి ఆయన వెంటనే అంగీకరించి తప్పకుండా వస్తాను అని చెప్పారు. అంత పెద్ద స్టార్‌ మా ఆడియో ఫంక్షన్‌కి రావడం చాలా హ్యాపీగా ఫీల్‌ అవుతున్నాం. సెప్టెంబర్‌ 15న చాలా గ్రాండ్‌ లెవల్‌లో జరగనున్న ఈ ఆడియో ఫంక్షన్‌లో అర్నాల్డ్‌ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు'' అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.సి.శ్రీరామ్‌, సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఆర్ట్‌: ముత్తురాజు, ఫైట్స్‌: అనల్‌ అరసు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రమేష్‌బాబు, నిర్మాత: ఆస్కార్‌ వి.రవిచంద్రన్‌, దర్శకత్వం: శంకర్‌.