గురువారం, 7 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By PNR
Last Updated : ఆదివారం, 27 సెప్టెంబరు 2015 (16:39 IST)

పదేళ్ళ తర్వాత మళ్లీ మాతృభాషపై కన్నేసిన అసిన్!

ప్రస్తుత బాలీవుడ్ చిత్ర రంగంలో బిజీగా ఉన్న మలయాళ కుట్టి అసిన్.. దాదాపు దశాబ్ద కాలం తర్వాత తిరిగి మాతృభాషలో నటించనుంది. సరిగ్గా పదేళ్ల క్రితం "నరేంద్రన్‌ మకన్‌ జయకాంతన్‌ వాకా" అనే చిత్రం ద్వారా ఆమె సినిమా రంగానికి పరిచయమయ్యారు. ఆ తర్వాత వరుసగా తమిళ, తెలుగు, హిందీ సినిమాలలో అవకాశాలు వచ్చి స్టార్‌ హీరోయిన్‌‌ రేంజ్‌కు ఎదిగారు. 

అప్పటి నుంచి ఆమె మలయాళ సినిమాలు చేయడానికి ఒక్క క్షణం కూడా తీరిక దొరకలేదు. ఇపుడు అంటే పదేళ్ల విరామ తర్వాత తాజాగా ఆమె మాతృభాష చిత్రంలో నటించేందుకు సమ్మతించింది. శ్యాం ప్రసాద్‌ దర్శకత్వంలో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది.

దీనిపై అసిన్ స్పందిస్తూ.. చాలాకాలం తర్వాత మళ్లీ మాతృభాషలో చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమాతో పాటు ప్రస్తుతం తను హిందీలో "హౌస్‌ఫుల్‌- 2", "బోల్‌ బచ్చన్" చిత్రాల్లో నటిస్తున్నట్టు వివరించింది. చేసేది తక్కువ సినిమాలే అయినా... మంచి సినిమాలు చేయాలన్నే తన కోర్కె అని చెప్పింది.