ముసలాళ్లతో కూడా నటిస్తా: శృతి హాసన్
కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ తండ్రి బాటలో పయనిస్తున్నట్లు కనబడుతోంది. విలక్షణ నటిగా పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడుతోంది. కుర్ర హీరోలు, సీనియర్ నటులతోపాటు అవసరమైతే వృద్ధ నటులతో కూడా నటిస్తానని చెపుతోందట. ఇప్పటికే బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలతో మహా బిజీగా ఉన్న ఈ తార తాజాగా టాలీవుడ్‌పై దృష్టి సారించింది.
ప్రస్తుతం యువహీరో సిద్ధార్ద్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. పనిలోపనిగా షూటింగ్ మధ్యలో తెలుగు భాషను నేర్చుకునేందుకు కసరత్తు చేస్తోందట. తెలుగు భాషను నేర్చుకోవడం మొదలుపెట్టిన దగ్గర్నుంచి కొందరు యువహీరోలు శృతికి అప్పుడప్పుడు తెలుగు భాషపై క్లాసులు తీసుకుంటున్నారట. యువహీరోల తెలుగు భాష బోధనతో శృతికి తెలుగుపై త్వరలోనే పట్టు సాధించేస్తుందని టాలీవుడ్ సినీజనం అంటున్నారు.