'బాహుబలి'ని తలదన్నే సినిమా తీస్తా... ఆ హిస్టరీని చెరిపేస్తా : అమీర్ ఖాన్ శపథం
'బాహుబలి 2' ప్రభంజనాన్ని చూసి బాలీవుడ్ నటీనటులు కళ్లుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రం విజయాన్ని ప్రశంసిస్తూ చేసిన ట్వీట్లు వారి మనస్ఫూర్తిగా చేసినట్టుగా లేవు. ముఖ్యంగా బాలీవుడ్ చిత్రాల
'బాహుబలి 2' ప్రభంజనాన్ని చూసి బాలీవుడ్ నటీనటులు కళ్లుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రం విజయాన్ని ప్రశంసిస్తూ చేసిన ట్వీట్లు వారి మనస్ఫూర్తిగా చేసినట్టుగా లేవు. ముఖ్యంగా బాలీవుడ్ చిత్రాల గత రికార్డులను చెరిపేస్తూ రూ.1000 కోట్ల ఘనత సాధించిందన్న ఒకే ఒక్క కారణంతో పొడి.. పొడి మాటలన్నారే తప్ప.. గుండె లోతుల్లో నుంచి వారు కొనియాడినట్టు ఎక్కడా కనిపించడంలేదు. దీనికి కారణం బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తాజాగా చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. బాలీవుడ్‌ను తలదన్నే చిత్రాన్ని నిర్మించి.. బాహుబలి హిస్టరీని చెరిపేస్తానంటూ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఈ బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్... అతడు 'ధూమ్-3' డైరెక్టర్ విజయ్ కృష్ణ డైరెక్షన్‌లో "థగ్స్ ఆఫ్ హిందూస్థాన్" సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో దాన్ని మించేటట్టుగా థగ్స్ ఆఫ్ హిందూస్థాన్‌ను తీయాలనుకుంటున్నారట. విజయ్ కృష్ణ, అమీర్ ఖాన్. అందుకే రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో మూవీని తెరకెక్కించాలని, 'పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్' రీతిలో ఎక్కువ సీక్వెల్స్‌ను తీయాలన్న ఆలోచనలో వారిద్దరు ఉన్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం.
ఇందుకోసం స్క్రిప్ట్‌ను చాలా జాగ్రత్తగా సిద్ధం చేస్తున్నట్టు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ బాహుబలిని 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' మించిపోవాలన్న కృతనిశ్చయంతో విజయ్ కృష్ణ పనులు ప్రారంభించినట్టు చెబుతున్నారు. స్క్రిప్ట్‌లో ఎలాంటి లోపాలు లేకుండా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నారని అంటున్నారు. బాహుబలి హిస్టరీని చెరిపేసి 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్'తో సరికొత్త చరిత్రను లిఖించాలని విజయ్ కృష్ణ అండ్ టీం పనిచేస్తోందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.