ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: గురువారం, 13 డిశెంబరు 2018 (21:10 IST)

ఆ దర్శకుడికి ఫోన్ చేసి ఆపకుండా తిట్టిన సునీల్.. ఎందుకు?

సునీల్ ఉంటే ఒకప్పుడు మూవీ హిట్. హీరోగా కొన్ని సినిమాలు చేసి ఆ తరువాత కమెడియన్‌గా కొత్త ఇన్నింగ్ మొదలుపెట్టాడు. అయినా సునీల్‌కు హిట్ రావడం లేదు. కొత్త ఇన్సింగ్ అస్సలు కలిసి రావడం లేదు. 
 
సునీల్ హీరో వేషాలు మానేశాడు. కమెడియన్‌గా మారిపోయాడు. ఈ యేడాది అరవింద సమేత సినిమాలో అలా కనిపించాడు. అలాగే అమర్ అక్బర్ ఏంటోనిలో కమెడియన్‌గా దర్శనమిచ్చాడు. ఈ సినిమాలు రెండు సినిమాలు సునీల్‌కు కలిసి రాలేదు. రవితేజ నటించిన సినిమాలో పుల్ లెగ్త్ కామెడి రోల్ పోషించారు. సినిమాకి డైరెక్టర్ శ్రీనువైట్ల. కామెడీ తీయడంలో వైట్ల స్పెషలిస్ట్. అందుకే సునీల్ ఎగిరి గంతేసి సినిమా ఒప్పుకున్నాడు.
 
కానీ ఇది ఘోరంగా పరాజయం పాలైంది. ఈ యేడాది సునీల్ సిల్లీ ఫెలోస్, అరవింద సమేత సినిమాల్లో కమెడియన్‌గా నటించారు. సిల్లీ ఫెలోస్ సినిమాలో మంచి పాత్ర దక్కింది. కానీ సినిమా ఆడలేదు. ఇక అరవింద సమేత సినిమాలో సీరియస్ రోల్ ఇచ్చారు. కామెడీని ప్రదర్శంచే ఛాన్స్ ఇవ్వలేదు. అది విజయం సాధించినా సునీల్‌కు కలిసి రాలేదు. 
 
కనీసం అమర్ అక్బర్ ఏంటోని సినిమాతోనైనా కమెడియన్‌గా మంచి లైన్లో పడదామనుకున్నాడు. కానీ శ్రీను వైట్ల సునీల్‌ను బోల్తా కొట్టించాడు. దీంతో సునీల్ దర్శకుడు శ్రీను వైట్లకు ఫోన్ చేసి నాకు బాడ్ టైం స్టార్ట్ అయ్యిందంటూ దర్శకుడిపై కోప్పడ్డాడట. శ్రీను వైట్ల కూడా అదేస్థాయిలో సునీల్‌కు సమాధానమిచ్చాడట. శ్రీనువైట్ల, సునీల్ మంచి స్నేహితులు కాబట్టే ఇద్దరూ ఫోన్లో అరుచుకున్నా ఆ తరువాత సర్దుకుపోయారట.