మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: గురువారం, 19 ఏప్రియల్ 2018 (21:18 IST)

నేను హీరోనా.. ఎవరు చెప్పారు.. సునీల్ ప్రశ్న

2018 సంవత్సరంలో హీరో పాత్రలకు గుడ్ బై చెప్పాడు సునీల్. ఇప్పటివరకు హీరోగా ఒక్క మూవీ కూడా ఒప్పుకోలేదు. కానీ ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్రలను మాత్రమే చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు సునీల్. కమెడియన్‌గానే కొనసాగాలన్న నిర్ణయానికి వచ్చేశాడు. 2017 సంవత్సరం చివరలో

2018 సంవత్సరంలో హీరో పాత్రలకు గుడ్ బై చెప్పాడు సునీల్. ఇప్పటివరకు హీరోగా ఒక్క మూవీ కూడా ఒప్పుకోలేదు. కానీ ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్రలను మాత్రమే చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు సునీల్. కమెడియన్‌గానే కొనసాగాలన్న నిర్ణయానికి వచ్చేశాడు. 2017 సంవత్సరం చివరలో 2 కంట్రీస్ సినిమా రిలీజైంది. ఆ సినిమా దారుణంగా పరాజయం పాలైంది. అంతకుముందు విడుదలైన సునీల్ సినిమాలు అదేవిధంగా ఫ్లాపయ్యాయి. 
 
అయితే 2 కంట్రీస్ సినిమాతో సునీల్‌కు మ్యాటర్ అర్థమైపోయింది. 2018లో తెలివైన నిర్ణయం తీసుకున్నాడు సునీల్. ఈ సంవత్సరంలో హీరోగా ఒక్క సినిమాకు కూడా సంతకం పెట్టలేదు. ఇకముందు కూడా హీరో పాత్రలు పోషించాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నాడట. అందుకే తనకు పేరు తెచ్చిన కామెడీ పాత్రలకే పరిమితం కావాలనుకుంటున్నాడట సునీల్. 
 
ప్రస్తుతం సునీల్ భీమినేని దర్సకత్వంలో నటిస్తున్నాడు. అలాగే రవితేజ హీరోగా శ్రీనువైట్ల తీస్తున్న కొత్త సినిమాలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీలో ఛాన్స్ కొట్టాడు. తాజాగా రాజశేఖర్‌తో కలిసి సినిమా చేయబోతున్నాడు. ఇలా వరుసగా నాలుగు చిత్రాల్లో ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్రలను పోషించనున్నాడట. హీరోగా అచ్చిరాలేదు కాబట్టి కమెడియన్‌గానే ఉండిపోవాలన్న ఆలోచనలో ఉన్నారట సునీల్.