శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : ఆదివారం, 25 జూన్ 2017 (10:34 IST)

విరబూసిన కురులు... పింక్ షేడ్ గ్లాసెస్‌తో అదరగొట్టిన జాహ్నవి...

బాలీవుడ్ అతిలోక సుందరి శ్రీదేవి అందం గురించి వర్ణించేందుకు మాటలు చాలవు. పదాలు కూడా లేవు. అలాంటి అందగత్తె కడుపున పుట్టిన ఆమె కుమార్తె అందాన్ని కూడా వర్ణించలేని విధంగా ఉంది. తాజాగా జాహ్నవి కూల్ కూల్ లుక

బాలీవుడ్ అతిలోక సుందరి శ్రీదేవి అందం గురించి వర్ణించేందుకు మాటలు చాలవు. పదాలు కూడా లేవు. అలాంటి అందగత్తె కడుపున పుట్టిన ఆమె కుమార్తె అందాన్ని కూడా వర్ణించలేని విధంగా ఉంది. తాజాగా జాహ్నవి కూల్ కూల్ లుక్‌లో ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చింది. ఈ లుక్‌లో జాహ్నవిని చూసిన ప్రతి ఒక్కరూ ఔరా.. ఏమి అందం అంటూ నోరెళ్లబెట్టారు. 
 
నిజానికి శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ ఇటీవలి కాలంలో తరచూ వార్తలకెక్కుతోంది. ఒకసారి ఈవెంట్లలో, మరోసారి సెలబ్రిటీల పార్టీల్లో... ఇలా ప్రతీచోటా ప్రత్యేకంగా కనిపిస్తోంది. దీంతో జాహ్నవికి చెందిన ప్రతీ ఫొటో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిపోతోంది. సింపుల్ క్యాజువల్ అవుట్ ఫిట్ లేదా ట్రెడిషినల్ డ్రెస్సులు ధరించి అందరినీ సమ్మోహనపరుస్తోంది.
 
తాజాగా జాహ్నవి ఎయిర్ పోర్టులో మల్టీకలర్ క్రాప్ టాప్.. హై వెస్ట్ డెనిమ్‌తో అద్భుతంగా దర్శనమిచ్చింది. విరబూసిన కురులు... పింక్ షేడ్ గ్లాసెస్‌తో జాహ్నవి అందంతో అదరగొట్టింది. ఆరెంజ్ అండ్ బ్లూ హై హీల్స్.. భుజానికి వేలాడుతున్న సింగిల్ బ్యాగ్.. ఆమె స్టయిల్ స్టేట్‌మెంట్‌లో భాగమైపోయాయి. బ్లూ నెయిల్ పెయింట్ కూడా కొట్టొచ్చేలా కనిపిస్తోంది.