బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2017 (17:42 IST)

స్లిమ్‌గా కనిపించేందుకు ఐష్ ఏం చేస్తుందో తెలుసా? (Video)

నవంబర్ ఒకటో తేదీన 44వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న అందాలభామ ఐశ్వర్యారాయ్. ఈ ముదురు భామ ఇప్పటికీ నాజూగ్గానే కనిపిస్తోంది. నాలుగు పదుల వయసులో కూడా ఈ బాలీవుడ్ బ్యూటీ ఇంత అందంగా కనిపించడం వెనుక ఉన్న సీక

నవంబర్ ఒకటో తేదీన 44వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న అందాలభామ ఐశ్వర్యారాయ్. ఈ ముదురు భామ ఇప్పటికీ నాజూగ్గానే కనిపిస్తోంది. నాలుగు పదుల వయసులో కూడా ఈ బాలీవుడ్ బ్యూటీ ఇంత అందంగా కనిపించడం వెనుక ఉన్న సీక్రెట్స్ ఇపుడు బహిర్గతమైంది. ఆ రహస్యాలపై బాలీవుడ్‌లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. 
 
విశ్వసుందరిగా ప్రపంచ గుర్తింపు పొందిన ఐశ్వర్యా రాయ్.. ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టి.. తన అందచందాలతో ఎంతోమందిని ఆకట్టుకుంది. చిత్రసీమలో కూడా సూపర్ సక్సెస్ సాధించింది. దశాబ్దానికిపైగా ప్రేక్షకులను అలరించిన ఈ అందాల భామ. పెళ్లయి, ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా హీరోయిన్‌గా రాణించేందుకు ప్రయత్నిస్తోంది. 
 
గతేడాది వచ్చిన 'యే దిల్ హే ముష్కిల్' సినిమాలో మరోసారి తనలోని రొమాంటిక్ యాంగిల్‌‌ను ప్రేక్షకులకు చూపించిన ఐష్ ప్రస్తుతం 'ఫన్నీ ఖాన్' అనే సినిమాలో యాక్ట్ చేస్తోంది. ఈ సినిమాలో సింగర్‌గా కనిపించబోతున్న ఐశ్వర్యరాయ్ గ్లామరస్‌గా కనిపించేందుకు చాలానే జాగ్రత్తలు తీసుకుంటోందని తెలుస్తోంది. 
 
ఈ క్రమంలోనే ఆమె కేరళ నుంచి ఒక ఆయిల్‌ను తెప్పించుకుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఆయిల్ ఒంటికి రుద్దుకోవడం వల్ల స్లిమ్‌గా కనిపిస్తారని ఐశ్వర్యరాయ్ ఎంతగానో నమ్ముతోందట. ‘ఫన్నీ ఖాన్’ సినిమాలో సన్నగా కనిపించేందుకే ముదురు భామ ఇలాంటి వాటిని వాడుతోందని సినీజనం చెవులు కొరుక్కుంటున్నారు.
 
మరోవైపు ఐష్ ఎప్పటి నుంచో ఈ ఆయిల్ వాడుతోందనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. ఈ ఆయిల్ కారణంగానే అప్పటి నుంచి ఐష్ లావెక్కకుండా ఉంటోందని ఆమె సన్నిహితులు చెబుతున్నారట. ఏదేమైనా ‘ఫన్నీ ఖాన్’ సినిమాలో ఐశ్వర్యరాయ్ మరీ స్లిమ్‌గా కనిపిస్తే ఆమె ఆర్డర్ చేసిన ఆయిల్‌కు బాలీవుడ్‌లో డిమాండ్ పెరుగుతుందేమో అని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.