శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (20:42 IST)

అఖిల్ అక్కినేని... పేరొస్తోంది కానీ పెళ్లి కాదా...? జ్యోతిషం ఏం చెపుతోంది?

అక్కినేని అఖిల్ గురించి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా అఖిల్ అక్కినేని - శ్రియా భూపాల్ నిశ్చితార్థం బెడిసికొట్టిందనీ, పెళ్లి జరిగే అవకాశం లేదనే వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అఖిల్ భవిష్యత్తు ఎలా

అక్కినేని అఖిల్ గురించి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా అఖిల్ అక్కినేని - శ్రియా భూపాల్ నిశ్చితార్థం బెడిసికొట్టిందనీ, పెళ్లి జరిగే అవకాశం లేదనే వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అఖిల్ భవిష్యత్తు ఎలా వుంటుందో చెప్పేస్తున్నారు పలువురు జ్యోతిష్కులు. ఇంతకీ వారు ఏం చెపుతున్నారయా అంటే...
 
అక్కినేని అఖిల్ పుట్టిన నక్షత్రం ప్రకారం ఆయనకు విపరీతమైన పేరుప్రతిష్టలు వస్తాయట. ఐతే రాహువు మొదటి పాదంలో వుండటంతో అతడికి నిశ్చితార్థం అయినప్పటికీ వ్యవహారం బెడిసికొడుతుందట. పెళ్లి పీటల దాకా వెళ్లిందనుకున్నప్పటికీ పెళ్లి ఆగిపోతుందట. పైగా చంద్రుడు మనఃకారకుడు కావడంతో అఖిల్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియని అయోమయ స్థితి వుంటుందట.
 
అఖిల్ జాతకం ప్రకారం అతడిపై నాగార్జున కంటే అమల ప్రభావమే ఎక్కువగా ఉంటుందనీ, తల్లి ప్రభావంతోనే అతడు నిర్ణయాలు ఆధారపడి వుంటాయని చెపుతున్నారు. చంద్రుడు-శని కాంబినేషన్ వుండటం చేత అతడి వివాహ పరిస్థితి ఆటుపోట్లు గురవుతుందని సెలవిస్తున్నారు. మరి అఖిల్ నిర్ణయం ఏంటో... అసలు ఏం జరుగుతుందో?