శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2020 (15:55 IST)

అక్కినేని బ్రదర్స్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్నారా..?

అక్కినేని బ్రదర్స్.. నాగచైతన్య, అఖిల్. వరుసగా సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీలో ఉన్నారు. నాగచైతన్య లవ్ స్టోరీ మూవీ చేస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు.
 
ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు - వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. అక్కినేని బ్రదర్స్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఇంతకీ మేటర్ ఏంటంటే... ఈ నెల (సెప్టెంబర్) 20న మహానటుడు డా. అక్కినేని జయంతి. ఈ సందర్భంగా అక్కినేని అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
 
అక్కినేని జయంతి సందర్భంగా నాగచైతన్య లవ్ స్టోరీ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేయనున్నట్టు తెలిసింది. మరో వార్త ఏంటంటే… అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. రీసెంట్‌గా ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసారు. క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే కూడా షూటింగ్‌లో జాయిన్ అయ్యింది. ఈ సినిమా టీజర్ కూడా అక్కినేని జయంతి రోజున రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఇదే కనుక జరిగితే… అక్కినేని అభిమానులకు పండగే..!