శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Updated : మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (23:06 IST)

ప్రభాస్‌కి షాక్ ఇచ్చిన అఖిల్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాథాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యు.వి. క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇందులో రెబల్‌స్టార్ కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సంవత్సరంలోనే ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ... కరోనా కారణంగా కుదరలేదు.
 
ప్రభాస్ - పూజాహేగ్డే జంటగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. హైదరాబద్‌లోనే భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే ఇప్పుడు ప్రభాస్‌కి అఖిల్ షాక్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ మేటర్ ఏంటంటే... అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.
 
ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అఖిల్ సరసన పూజా హేగ్డే నటిస్తుంది. ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ కావాల్సి వుంది కానీ కుదరలేదు. ప్రభాస్ రాథేశ్యామ్, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ పూజా హేగ్డే.
 
అయితే ముందుగా ప్రభాస్ రాథేశ్యామ్ మూవీ షూటింగ్‌లో జాయిన్ అవుతుంది అనుకున్నారు కానీ... అఖిల్ తన సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి షాక్ ఇచ్చాడు. అఖిల్, పూజాపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ రాథేశ్యామ్ వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో రిలీజ్ కానుంది.