మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (15:25 IST)

ప్రభాస్ పెళ్లి ఇప్పట్లో లేనట్టేనా..? క్రేజీ ప్రాజెక్టులను పూర్తి చేసే వరకు ఇంతేనా?

బాహుబలి హీరో ప్రభాస్‌కు ఇప్పట్లో వివాహం ఖరారయ్యేలా కనిపించట్లేదు. ఈ యంగ్ రెబల్ స్టార్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడని పలుసార్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తే ప్రభాస్ పెళ్లి ఇప్పట్లో జరిగడం కష్టమేననిపిస్తోంది. త్వరగా పెళ్లి చేసుకోవాలని ప్రభాస్ కుటుంబం, అభిమానులు కోరుకుంటుండగా.. ప్రభాస్ మాత్రం వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు. 
 
మరోవైపు వచ్చే రెండేళ్లకు సరిపడా భారీ బడ్జెట్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అన్నీ ప్రతిష్టాత్మక చిత్రాలే కావడంతో ప్రభాస్ ఈ క్రేజీ ప్రాజెక్టులను పూర్తి చేసే వరకు పెళ్లి ఊసెత్తడం కష్టమే. భవిష్యత్‌తో పాన్ ఇండియా స్టార్‌గా తన రేంజ్‌ను మరింత పెంచుకునేందుకు కేవలం కెరీర్ పైనే ఫోకస్ పెడుతున్నాడు ప్రభాస్‌. 
 
ప్రభాస్‌కు పలువురు హీరోయిన్లతో లింకప్ పుకార్లు వచ్చినా.. దీనిపై యంగ్ రెబల్ స్టార్ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ప్రస్తుతం బ్యాచిలర్ లైఫ్‌ను ఎంజాయ్ చేసేందుకు ఇష్టపడుతున్న ప్రభాస్ సరైన సమయంలో పెళ్లి నిర్ణయం తీసుకుంటాడని పలువురు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.