శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 మార్చి 2017 (14:42 IST)

బన్నీ-పవన్ వార్‌: అల్లు అర్జున్ డీజే టీజర్‌కు పవన్ ఫ్యాన్స్ డిస్‌లైక్ కొట్టారా?

అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రానున్న దువ్వాడ జగన్నాథం సినిమా షూటింగ్ షెడ్యూల్ దుబాయ్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్, హీరొయిన్ పూజ హెగ్డే కూడా పాల్గొంటారు. కొన్ని కీలక సన్ని

అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రానున్న దువ్వాడ జగన్నాథం సినిమా షూటింగ్ షెడ్యూల్ దుబాయ్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్, హీరొయిన్ పూజ హెగ్డే కూడా పాల్గొంటారు. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ సాంగ్‌ను కూడా దుబాయ్‌లో చిత్రీకరించనున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇటీవలే రిలీజ్ అయిన ఈ టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ టీజర్ ఆరు మిలియన్‌ల వ్యూవ్స్‌తో పాటు లక్ష డిస్‌లైక్స్‌ను కూడా సంపాదించుకుంది. అయితే ఇదే బన్నీ-పవన్‌ల మధ్య చిచ్చు పెట్టింది. 
 
ముందు నుంచే బన్నీకి-పవన్‌కు కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఏ టీజర్ విడుదలైనా ఫ్యాన్స్ లైక్ చేస్తారు. లేదా కామ్‌గా ఉండిపోతారు. అయితే బన్నీ డీజే టీజర్‌కు మాత్రం డిస్‌లైక్స్ వచ్చాయి. అయితే బన్నీ ఇమేజ్‌ను దెబ్బ తీసేందుకే పవన్ ఫ్యాన్స్ డిస్‌లైక్ కొట్టారని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా పవన్-బన్నీ ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అల్లు కుటుంబంతో పవన్‌ సంబంధాలను మెరుగుపరిచే దిశగా మెగా ఇంట చర్చలు జరుగుతున్నాయి.

ముందు నుంచి పవన్ కల్యాణ్‌కి అల్లు ఫ్యామిలీకి సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అసలు అల్లు అరవింద్‌తో సత్సంబంధాలు లేకపోవడం వలనే మెగాఫ్యామిలి ఫంక్షన్స్‌కి పవన్ రావడం మానేసాడని వార్తలు కూడా వస్తున్నాయి. 
 
ఇందులో నిజానిజాలు పక్కనపెడితే, అల్లు హీరోలు అర్జున్, శిరీష్‌లకి మాత్రం పవర్ స్టార్‌తో సరైన సంబంధాలు లేవని కొన్ని సంఘటనలతో ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. చెప్పను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ స్టేట్ మెంట్ అప్పట్లో అలజడి సృష్టిస్తే, తాజాగా “విపిగాడు” అంటూ పవన్ మీద శిరీష్ చేసిన కామెంట్స్ వారిమీద పవన్ ఫ్యాన్స్ పగ పెంచుకునేలా చేశాయి. అందుకే డీజే టీజర్‌కి కుప్పకుప్పలుగా డిస్ లైక్స్ పడుతున్నాయి.

ఇక అల్లువారింటికి పవన్ ఫ్యాన్స్‌తో కష్టాలు తప్పవని సినీ పండితులు అంటున్నారు. పవన్-బన్నీ మెగా కుటుంబం నుంచి వచ్చిన వారే. అలాంటప్పుడు.. గొడవల్లేకుండా ముందుకెళ్లేందుకు ఇద్దరు హీరోలు తగిన చర్యలు తీసుకోవాలని వారు చూస్తున్నారు. లేకుంటే మెగా ఫ్యాన్స్‌ మధ్య చీలిక ఏర్పడుతుందని వారు సూచిస్తున్నారు.