త్వరలో పట్టాలెక్కనున్న 'డి.జె..దువ్వాడ జగన్నాథమ్'... భారీ బడ్జెట్‌తో
''సరైనోడు'' వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై హిట్ చిత్రాల నిర్మా
''సరైనోడు'' వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ''డి.జె..దువ్వాడ జగన్నాథమ్''. ఈ చిత్రంలో పూజాహెగ్దే కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ చెన్నైలో జరుగుతున్నాయి.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం మొదలైంది. అల్లు అర్జున్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. మరోపక్క... బన్నీ భార్య స్నేహారెడ్డి మరో నెలలో రెండో బిడ్డకు జన్మనిస్తున్న నేపథ్యంలో బన్నీ షూటింగ్‌కు విరామం ఇవ్వనున్నారని... నవంబరులోనే ''దువ్వాడ జగన్నాథమ్''చిత్రం షూటింగ్‌లో పాల్గొంటారని పుకార్లు వినిపించాయి.
అయితే ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ ''డిజే బిగైన్స్'' అనే పోస్ట్‌తో టోటల్ క్లారిటీ ఇచ్చాడు బన్నీ. సినిమా కథ, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్‌కాని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దువ్వాడ జగన్నాథమ్ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా నిర్మాత ప్లాన్ చేస్తున్నారు.