'బద్మాష్'గా మారనున్న అల్లు అర్జున్...
ప్రస్తుతం అల్లు అర్జున్ ''దువ్వాడ జగన్నాథం'' చిత్రంలో నటిస్తూ బిజిబిజీగా ఉన్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక అల్లు అర్జున్ తదుపరి చిత్రం కోసం కసరత్త
ప్రస్తుతం అల్లు అర్జున్ ''దువ్వాడ జగన్నాథం'' చిత్రంలో నటిస్తూ బిజిబిజీగా ఉన్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక అల్లు అర్జున్ తదుపరి చిత్రం కోసం కసరత్తు జరుగుతుంది. ఈ నేపథ్యంలో కన్నడలో త్వరలో విడుదల అవుతున్న కన్నడ మూవీ ''బద్మాష్''పై అల్లు అర్జున్ కన్ను పడిందట, విడుదలకు ముందే ఈ సినిమా అక్కడ సంచలనం రేపడంతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారట.
రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత అల్లు అరవింద్. కన్నడ హీరో ధనుంజయ హీరోగా నటించిన ఈ సినిమా అర్బన్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుందట, పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా ఉండే ఈ సినిమా తెలుగులో అల్లు అర్జున్ చేయాలని భావిస్తున్నారట.
ఇక అల్లు అరవింద్ కూడా ఆ సినిమా పట్ల ఆసక్తిగా ఉన్నాడట దాంతో బద్మాష్ సినిమా స్పెషల్ స్క్రీనిగ్ ఏర్పాటు చేయమని కన్నడ నిర్మాతలను కోరారట. తన బాడీ లాంగ్వేజ్‌కి దగ్గరగా ఉండటంతో, ఈ సినిమా రీమేక్ చేయడానికి అల్లు అర్జున్ ఆసక్తిని చూపుతున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నారు. తెలుగులో ఈ సినిమాను పీవీపీ నిర్మించనున్నట్లు చెబుతున్నారు. మరి ఈ సినిమా గనక ఓకే అయితే .. తెలుగులో కూడా ”బద్మాష్” అని టైటిల్ పెడతారో.. లేక.. మరో టైటిల్ పెడతారో చూడాలి.