శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 జూన్ 2021 (10:32 IST)

అమలా పాల్ కొత్త బాయ్‌ఫ్రెండ్.. నెట్టింట ఫోటో వైరల్

Amala Paul
స్టార్ హీరోయిన్ అమలపాల్‌కు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అమల పాల్ గురించి ఓ న్యూస్ వైరల్‌గా మారింది. ఇటీవల ఓ వ్యక్తి తొడపై కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తూ దిగిన ఫోటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేసింది.

దీంతో అమలాపాల్‌ కొత్త వ్యక్తితో ప్రేమలో పడిందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన ఆమె క్లారిటీ ఇచ్చింది. ఆయన తన లవర్‌ కాదని, సోదరుడు అంటూ చెప్పడంతో అందరు కూల్ అయ్యారు. మరి ఇందులో నిజం ఎంత ఉందని అందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
 
ఇకపోతే.. తాజాగా అమలాపాల్ లీడ్ రోల్ లో ఒక ఆసక్తికర ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసింది. త్వరలో ఆహాలో 'కుడి ఎడమైతే' అనే ప్రస్టీజియ‌స్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. మోషన్ పోస్టర్‌లో అమ‌లా పాల్, అసలు ఏమాత్రం కనికరం లేని ఒక క్రూర‌మైన పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తుంటే.. రాహుల్ విజ‌య్ డెలివ‌రీ బాయ్ పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు.

పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తోన్న ఈ సిరీస్‌లో ప్రేక్ష‌కుల‌కు ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. ఇక ఈ సిరీస్ ఎప్పుడు స్ట్రీమ్ అవుతుంది, అనే విషయాలను త్వరలోనే వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.