''ఏయ్ అబ్బాయ్.. రాంగ్ డైరక్షన్‌లో వెళ్ళొద్దు.. మహిళల్ని గౌరవించడం నేర్చుకో''.. అమలాపాల్ వార్నింగ్
మలయాళ బ్యూటీ అమలాపాల్ డైరెక్టర్ ఎ.ఎల్ విజయ్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత పలు సినిమాలతో బిజీగా మారింది. వచ్చిన ఆఫర్లన్నింటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా మారిపోయింది. ఇప్
మలయాళ బ్యూటీ అమలాపాల్ డైరెక్టర్ ఎ.ఎల్ విజయ్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత పలు సినిమాలతో బిజీగా మారింది. వచ్చిన ఆఫర్లన్నింటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా మారిపోయింది. ఇప్పటికే ధనుష్ హీరోగా రూపొందుతున్న ''వడచెన్నయ్'' అనే చిత్రంలో కథానాయికగా నటిస్తోన్న అమలా కన్నడ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది.
గతంలో ధనుష్, అమలాపాల్ కాంబినేషన్‌లో వచ్చిన తమిళ మూవీ ''వేల ఇల్లా పట్టదారి''(విఐపి)ని ప్రస్తుతం కన్నడలో రీమేక్ చేస్తోండగా ఇందులోను కథానాయికగా నటించే ఛాన్స్ ఈ అమ్మడికే దక్కింది. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాణంలో ప్రముఖ నటుడు రవిచంద్రన్ తనయుడు మనోరంజన్ హీరోగా ఈ మూవీ తెరకెక్కనుంది. ఇందులో కథానాయిక పాత్ర కోసం చాలా మందిని అనుకున్న చివరికి అమలాపాల్‌నే యూనిట్ సభ్యులు ఎంపిక చేశారు. మొత్తానికి విడాకుల తర్వాత అమలా సినిమాలపైనే తన పూర్తి దృష్టిని పెట్టడం విశేషం.
సుదీప్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ''హెబ్బులి'' అనే చిత్రంలోను అమలా కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే అత్తామామలకు ఆమె తీరు నచ్చకపోవడంవల్లే ఆమె భర్త విడాకులిచ్చాడని సోషల్ మీడియాలో ఆమెను ప్రస్తావిస్తూ వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా 'విడాకులు తీసుకున్న మహిళలు ఎప్పుడూ హాట్‌గా, నాటీగా ఉంటారు' అని ఓ ఆకతాయి సోషల్ మీడియాలో అమలా పాల్‌ని కామెంట్ చేశాడు.
ఈ కామెంట్‌కి అమలాపాల్ ఘాటుగా సమాధానమిచ్చింది. ''ఏయ్ అబ్బాయ్.. నీ యాంబిషన్ రాంగ్ డెరైక్షన్‌లో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ప్లీజ్.. మహిళలను గౌరవించడం నేర్చుకో'' అని సదరు ఆకతాయికి సమాధానమిచ్చింది.