సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శనివారం, 19 జనవరి 2019 (21:44 IST)

విజయ్ దేవరకొండకు ఫోన్ కొడుతున్న అనసూయ.. ఎందుకో తెలుసా?

బుల్లితెర నుంచి వెండితెర పైన వరుస అవకాశాలతో దూసుకుపోతోంది నటి అనసూయ. జబర్దస్త్ కార్యక్రమంతో ఒక్కసారిగా హాట్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న అనసూయకు సినిమాల్లో అప్పుడప్పుడు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఎఫ్‌-2 సినిమాలోను తెలుగు ప్రేక్షకులను అలరించిన అనసూయ తాజాగా విజయ్ దేవరకొండ సినిమాలో అవకాశం కోసం ప్రయత్నిస్తోందట. ఇప్పుడు ఇదే విషయం తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది.
 
విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి త్వరలో ఓ సినిమాను తీసేందుకు సిద్ధమయ్యారు. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ హీరో. హీరోయిన్‌తో పాటు దర్శకుడి కోసం వెతుకుతున్నారు. సినిమాలో ఒక ముఖ్యమైన రోల్ ఉంటుందని విజయ్ దేవరకొండ చెప్పారు. అది కూడా మహిళ పాత్ర అని విజయ్ దేవరకొండ చెప్పడంతో అనసూయ ఆ క్యారెక్టర్ పైన ఆశ పెట్టుకుంది. ఆ క్యారెక్టర్‌లో తను చేసేందుకు సిద్థమంటూ విజయ్ వెంట పడిందట. సాయంత్రమైతే విజయ్ దేవరకొండకు ఫోన్ చేయడం... అవకాశం ఇవ్వమని ప్రాధేయపడటం చేస్తోందట.
 
అనసూయ ఎందుకిలా చేస్తోందని సినీ పరిశ్రమలో చెవులు కొరుక్కుంటున్నారు. అయితే విజయ్ దేవరకొండ లాంటి పేరున్న హీరో సినిమాలో నటిస్తే క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉందనేది అనసూయ ఆలోచనట. అందుకే ఆమె ఇలా చేస్తోందన్న వారు లేకపోలేదు. అయితే అనసూయ అయితే ఈ క్యారెక్టర్‌కు సరిపోతుందన్న నిర్ణయానికి వచ్చేశారట విజయ్ దేవరకొండ. త్వరలో ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరో కూడా విజయ్ ప్రకటించే అవకాశం ఉంది.