మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 20 జులై 2018 (10:28 IST)

అనసూయపై నెటిజన్ల కోపం ఎందుకు.. పబ్లిసిటీ కోసం ఆ వీడియోను?

నటి అనసూయపై నెటిజన్లు మండిపడ్డారు. యాంకర్ అనసూయ హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 గుండా వెళ్తుండగా.. ఇంతలో ఓ వ్యక్తి కారు డ్రైవ్ చేసుకుంటూ అనసూయ కారును ఓవర్ టేక్ చేశాడు. అయితే అతను డ్రైవింగ్ చేస్తు

నటి అనసూయపై నెటిజన్లు మండిపడ్డారు. యాంకర్ అనసూయ హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 గుండా వెళ్తుండగా.. ఇంతలో ఓ వ్యక్తి కారు డ్రైవ్ చేసుకుంటూ అనసూయ కారును ఓవర్ టేక్ చేశాడు. అయితే అతను డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మొబైల్‌లో వీడియోలు చూస్తున్నాడు. ఇంతలో ఓ వ్యక్తి కారు డ్రైవ్ చేసుకుంటూ అనసూయ కారును ఓవర్ టేక్ చేశాడు. 
 
అయితే అతను డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మొబైల్ లో వీడియోలు చూస్తున్నాడు. దీంతో అనసూయ ఈ దృశ్యాన్ని వీడియో తీసి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ట్విట్టర్‌లో ట్యాగ్ చేసింది. 
 
''డియ‌ర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్‌.. ఇలాంటి సంఘ‌ట‌న‌లు నన్ను భయ‌పెట్టిస్తున్నాయి. ఇంత‌కు ముందు వేరే వారి త‌ప్పిదం వ‌ల‌న నేను ప్ర‌మాదానికి గుర‌య్యాను. ద‌య చేసి ఇలాంటి నిర్ల‌క్ష్య‌పు డ్రైవ‌ర్స్‌ని వ‌దలొద్దు. రోడ్లపైకొచ్చి త‌మ‌కిష్ట‌ మొచ్చిన‌ట్టు డ్రైవ్ చేసే వారికి.. ఇత‌రుల ప్రాణాలంటే లెక్క‌లేదా?'' అని అన‌సూయ పేర్కొంది. 
 
అయితే ఈ వీడియో సందేశంపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. మీరు చీఫ్ పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నారంటూ మండిపడ్డారు. అయితే అనసూయ మాత్రం నెటిజన్లకు ధీటుగా సమాధానం ఇచ్చింది. ఇలాంటి విమర్శలను పట్టించుకోనని.. తాను ఎలాంటి తప్పు చేయలేదని రీ ట్వీట్ చేసింది.