మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 2 జులై 2018 (14:02 IST)

''యాత్ర''లో రంగమ్మత్త..?

''యాత్ర'' పేరిట దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఆనందో బ్రహ్మ ఫేమ్ మహి వి.రాఘవ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహ

''యాత్ర'' పేరిట దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఆనందో బ్రహ్మ ఫేమ్ మహి వి.రాఘవ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్ల, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. శివ మేక సంస్థ సినిమాను సమర్పిస్తోంది. 
 
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ''యాత్ర'' చిత్రంలో ప్రముఖ యాంకర్, నటి అనసూయ కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది. కర్నూలుకు చెందిన రాజకీయ నాయకురాలిగా అనసూయ నటించనుందని ప్రచారం జరుగుతోంది. 
 
ఇప్పటికే వైఎస్సార్ బయోపిక్ ''యాత్ర'' సినిమాలో నటులు సుహాసిని, రావు రమేశ్‌ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిగా సుహాసిని, వైఎస్సార్‌ సన్నిహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేశ్‌ కనిపించనున్నారట.