గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2017 (10:02 IST)

అనుష్కను హర్ట్ చేసిన ప్రభాస్.. చిరంజీవి కూడా...

టాలీవుడ్ 'దేవసేన' అనుష్కను టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి, ప్రభాస్‌లు తీవ్రంగా మనసు నొప్పించారట. అనుష్క బాగా లావుగా ఉందని, ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేయవద్దని ఈ ఇద్దరు హీరోలు తమతమ దర్శక నిర్మాతలకు సూచించి

టాలీవుడ్ 'దేవసేన' అనుష్కను టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి, ప్రభాస్‌లు తీవ్రంగా మనసు నొప్పించారట. అనుష్క బాగా లావుగా ఉందని, ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేయవద్దని ఈ ఇద్దరు హీరోలు తమతమ దర్శక నిర్మాతలకు సూచించినట్టు సమాచారం.
 
ఈ విషయం తన చెవిన పడటంతో అనుష్క నొచ్చుకుని బరువు తగ్గే పనిలో నిమగ్నమైందట. ఇందుకోసం పర్సనల్ ట్రైనర్‌ను పెట్టుకుని జిమ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతోందని చెప్పుకుంటున్నారు. 
 
కాగా, మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా చారిత్రక నేపథ్యంలో "సైరా నరసింహా రెడ్డి" సినిమా తెరకెక్కుతోంది. అలాగే, 'బాహుబలి' చిత్రం తర్వాత ప్రభాస్ నటించే చిత్రం "సాహో". ఈ రెండు చిత్రాల్లో నటించే అవకాశం అనుష్కకు వచ్చింది. కానీ ఈ రెండింటిలోనూ ఆమె ఛాన్స్ కోల్పోయారు. దీనికి కారణం ఆమె లావుగా ఉండటమేనట.