మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2016 (11:50 IST)

టాలీవుడ్ టాప్ నిర్మాతను పెళ్లి చేసుకోనున్న అనుష్కశెట్టి

తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న అందాల అనుష్క పెళ్ళి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు షాక్. అనుష్క త్వరలో పెళ్ళి చేసుకోబోతోందనే వార్తలు టాలీవుడ్‌లో హల్ చల్ చేస్తున్నాయి.

తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న అందాల అనుష్క పెళ్ళి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు షాక్. అనుష్క త్వరలో పెళ్ళి చేసుకోబోతోందనే వార్తలు టాలీవుడ్‌లో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు చేతినిండా సినిమాలతో తీరిక లేకుండా ఉండడంతో అభిమానులు కూడా అనుష్క పెళ్ళి విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. 
 
అయితే అనుష్కపై వస్తున్న వదంతుల నేపధ్యంలో తన తల్లిదండ్రులు మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని ఎలాగైనా ఈ సంవత్సరం అనుష్కకు పెళ్ళి చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనుష్క తల్లిదండ్రులు పెళ్ళి సంబంధాలు వెతికే పనిలో బిజీగా గడుపుతున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
అయితే ఈ బొమ్మాళి టాలీవుడ్‌కు చెందిన టాప్ నిర్మాతను వివాహం చేసుకోనుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇది పరిశ్రమలో పెద్ద సంచలనంగా మారింది. వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నట్లు సమాచారం. అనుష్కతో నిర్మాత అన్యోన్యంగా ఉంటున్న విషయం నిర్మాత కుటుంబ సభ్యులకు కూడా తెలుసని నిర్మాతకు చెందిన సన్నిహిత వర్గాలు తెలిపాయి. 
 
ఆయన ఇఫ్పటికే అనుష్కతో పలు సినిమాలు కూడా నిర్మించారు. అయితే ఇప్పటికే పెళ్ళి అయిన ఆ నిర్మాతతో వివాహానికి అనుష్క కుటుంబ సభ్యులు అంగీకరిస్తారా? లేదా అన్నదే ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఈ పెళ్ళికి అనుష్క, ఆ నిర్మాత మాత్రం పూర్తిగా రెడీ అయిపోయారని సమాచారం. ఇదిలావుంటే.. పెళ్ళి తర్వాత ఈ అమ్మడు మళ్ళీ సినిమాల్లో నటిస్తుందో లేదో చూడాలి మరి.