శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 24 నవంబరు 2017 (12:14 IST)

రామ్ గోపాల్ వర్మ- నాగార్జున సినిమాలో దేవసేన

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, అక్కినేని నాగార్జున కాంబోలో తెరకెక్కే కొత్త చిత్రంలో బాహుబలి హీరోయిన్ దేవసేన అనుష్కశెట్టి హీరోయిన్‌గా నటించనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, అక్కినేని నాగార్జున కాంబోలో తెరకెక్కే కొత్త చిత్రంలో బాహుబలి హీరోయిన్ దేవసేన అనుష్కశెట్టి హీరోయిన్‌గా నటించనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 
 
యాక్షన్ సీన్స్ చిత్రీకరణతో మరో వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరై వుంటారా? అనేదానిపై ప్రస్తుతం ఫిలిమ్ నగర్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో టబును వర్మ-నాగ్ చిత్రంలో హీరోయిన్‌గా తీసుకునే అవకాశాలున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఈ చిత్రంలో హీరోయిన్‌గా అనుష్క శెట్టిని తీసుకునేందుకు సంప్రదింపులు జరుగుతున్నట్లు టాక్.
 
అనుష్కను తెలుగు తెరకి పరిచయం చేసింది నాగార్జునే. 'బాహుబలి' సమయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 'భాగమతి' సినిమాను అనుష్క ఇటీవలే పూర్తి చేసింది. కొత్తగా ఆఫర్లు చేతిలో లేకపోవడంతో నాగ్ సినిమాకు అనుష్క రెడీ అవుతున్నట్లు టాక్.