సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 23 నవంబరు 2017 (12:43 IST)

''హలో''లో అఖిల్ తల్లిదండ్రులు ఎవరో తెలుసా?

''హలో'' చిత్రంలో అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్నాడు. అతని కెరీర్‌లో ఇది రెండో సినిమా. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తోంది. క్రిస

''హలో'' చిత్రంలో అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్నాడు. అతని కెరీర్‌లో ఇది రెండో సినిమా. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా అఖిల్ తల్లిదండ్రులుగా బాహుబలి శివగామి, నంది అవార్డు గెలుచుకున్న విలక్షణ నటుడు జగపతిబాబు నటించనున్నారు. 
 
తన అమ్మా నాన్న అంటూ జగపతి బాబు.. రమ్యకృష్ణ పాత్రలను పరిచయం చేశాడు. అఖిల్‌తో పాటు జగపతిబాబు, రమ్యకృష్ణ లుక్స్ అదిరిపోయాయి. కథాపరంగా పెద్దింటి అబ్బాయిగా అఖిల్ నటించబోతున్నాడని ఈ లుక్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చు.
 
తొలి సినిమాలో కంటే ఈ చిత్రంలో అఖిల్ మరింత అందంగా కనిపించాడు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నాగార్జున నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సినీ యూనిట్ సర్వం సిద్ధం చేసుకుంటోంది.