శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 14 నవంబరు 2017 (15:16 IST)

డైరెక్టర్ కుమార్తెను బుట్టలో పడేసిన హీరో అఖిల్!

"అఖిల్‌"గా వెండితెర అరంగేట్రం చేసిన హీరో అఖిల్ అక్కినేని. అక్కినేని వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అఖిల్‌ తన రెండో చిత్రంతో ఖచ్చితంగా హిట్ కొట్టాలన్న తపనలో ఉన్నాడు. అందుకే అఖిల్ మూవీ

"అఖిల్‌"గా వెండితెర అరంగేట్రం చేసిన హీరో అఖిల్ అక్కినేని. అక్కినేని వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అఖిల్‌ తన రెండో చిత్రంతో ఖచ్చితంగా హిట్ కొట్టాలన్న తపనలో ఉన్నాడు. అందుకే అఖిల్ మూవీ డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత ఒక్క చిత్రానికి కూడా కమిట్ కాలేదు. 
 
ఈ నేపథ్యంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై "మనం" దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి "హలో" అనే పేరు పెట్టారు. 
 
ఈ చిత్రానికి సంబంధించిన మూవీ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. దీంతోపాటు టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. ఈనెల 16వ తేదీన విడుదల అవుతుందని చెప్పాడు. ఫస్ట్ లుక్ కొంచెం డిఫరెంట్‌గా ఉండటంతో.. టీజర్‌పై అంచనాలు పెరిగాయి.
 
కాగా, ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న 'హలో' చిత్రంలో డైరెక్టర్ ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.