శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By tj
Last Updated : శనివారం, 8 జులై 2017 (14:13 IST)

అది కనిపిస్తే ఎక్కడైనా ఆగిపోతా... అనుష్క

'బాహుబలి' తర్వాత అనుష్క క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. ఈ పొడుకాళ్ళ సుందరి మొదట‌లో మాస్ హీరోయిస్‌గా పేరు తెచ్చుకుంది గానీ బాహుబలి తర్వాత ఏ క్యారెక్టర్ అయినా అవలీలగా అనుష్క చేయగలదన్న మంచి పేరును సంపాదించు

'బాహుబలి' తర్వాత అనుష్క క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. ఈ పొడుకాళ్ళ సుందరి మొదట‌లో మాస్ హీరోయిస్‌గా పేరు తెచ్చుకుంది గానీ బాహుబలి తర్వాత ఏ క్యారెక్టర్ అయినా అవలీలగా అనుష్క చేయగలదన్న మంచి పేరును సంపాదించుకుంది. టాప్ హీరోయిన్లలో ఒకరుగా ఉన్న అనుష్క ప్రస్తుతం తన చేతిలో ఎన్నో సినిమాలతో బిజీబిజీగా ఉంటోంది. అయితే ఖాళీ దొరికితే మాత్రం అనుష్క అలా.. అలా.. చల్లటి.. అందమైన ప్రదేశాలకు వెళ్ళిపోతోంది. 
 
తనకు నచ్చిన ప్రదేశం కనిపిస్తే చాలట అనుష్క వెంటనే ఆగిపోయి అక్కడ ఎక్కువ సమయం గడిపి ఆ తర్వాత వెళుతుందట. అక్కడ ఎంత మంది ఉన్నా, తన అభిమానులు ఇబ్బందులు పెట్టేలా ఉన్నా, ఎంత రాత్రయినా సరే అనుష్క అవన్నీ పట్టించుకోదట. 
 
తనకు నచ్చిన ప్రాంతమైతే వెంటనే ఆగిపోతుందట అనుష్క. షూటింగ్ సమయాల్లోనే అనుష్క బయటకు వచ్చి ఇలా చేయడం వల్ల షూటింగ్ ఆగిపోతోందట. అయితే ఆమె మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోకుండా ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదిస్తోందట అనుష్క.