ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By కుమార్ దలవాయి
Last Modified: శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (11:13 IST)

బాలయ్యను నీడలా వెంటాడుతున్న వర్మ

ఒకవైపు బాలకృష్ణ ఎన్‌టీఆర్ బయోపిక్ రెండవ భాగం తీస్తుండగా మరోవైపు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్‌టీఆర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే లక్ష్మీస్ ఎన్‌టీఆర్ సినిమాపై ఇప్పటికే తెలుగుదేశం కార్యకర్తలు తీవ్రంగా విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.

దీనిపై చాలామంది టీడీపీ కార్యకర్తలు, బాలయ్య అభిమానులు రాంగోపాల్ వర్మపై అనేక విమర్శలు దాడులు కూడా చేసారు. దీనితో రెచ్చిపోయిన వర్మ ఖచ్చితంగా ఎన్‌టీఆర్ మహానాయకుడు సినిమా విడుదలైన పక్కరోజే తన సినిమాను విడుదల చేస్తానని భీష్మించుకు కూర్చున్నాడు.
 
మొదట ఎన్‌టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని జనవరి 25న విడుదల చేస్తామని ప్రకటించగా వర్మ తన సినిమాను జనవరి 26న విడుదల చేస్తానని ప్రకటించాడు. ఆ తర్వాత బాలయ్య తన సినిమాను ఫిబ్రవరి 7కి వాయిదా వేయగా, వర్మ కూడా తన సినిమాను ఫిబ్రవరి 8కి వాయిదా వేసాడు. తాజాగా ఎన్‌టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని ఫిబ్రవరి 22న విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం, దీనితో వర్మ కూడా ఆ పక్కరోజే తన సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నాడట.
 
ఈ విధంగా వర్మ బాలయ్యను నీడలా వెంటాడుతున్నాడు. ఒక వేళ ఎన్‌టీఆర్2 ఫిబ్రవరిలో కూడా వాయిదా పడితే వర్మ కూడా వాయిదా వేస్తాడేమో చూడాలి.