బాలయ్య సినిమాలో సన్నీ చిందులేయదట.. రేసుగుర్రం ఐటమ్ గర్లే ఖరారైందా?
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి హీరో బాలకృష్ణ 101వ సినిమా రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సన్నీలియోన్ హాట్ సాంగ్ వుంటుందని జోరుగా ప్రచారం సాగింది. అయితే బాలయ్య మాత్రం పోర్న్ స్టార్ కమ
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి హీరో బాలకృష్ణ 101వ సినిమా రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సన్నీలియోన్ హాట్ సాంగ్ వుంటుందని జోరుగా ప్రచారం సాగింది. అయితే బాలయ్య మాత్రం పోర్న్ స్టార్ కమ్ హీరోయిన్ సన్నీ లియోన్‌ను వద్దని.. పూరీతో చెప్పారట. అయితే బాలయ్యతో సన్నీ చిందులేయనుందనగానే ఫ్యాన్స్ ఎగిరి గంతేశారు.
కానీ బాలయ్య వద్దన్నారో లేకుంటే పూరీనే వద్దనుకున్నాడో తెలియదు కానీ సన్నీ ప్లేసులో రేసుగుర్రం ఐటమ్ గర్ల్ కయారా దత్‌ను ఎంపిక చేశాడు. ప్రస్తుతం బాలకృష్ణ పోర్చుగల్‌లో ఉన్నాడు. అక్కడి షెడ్యూల్ పూర్తి కాగానే భారత్‌కు వచ్చి స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడనున్నాడు.
ఆ పాటకు బాలయ్య సరసన కయారా దత్ కాలు కదపనుంది. ఇందుకోసం హైదరాబాద్‌లో భారీ సెట్ వేయనున్నారని టాక్. కాగా సన్నీ బాలయ్య సినిమాలో చిందులేసేందుకు ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడమే కారణమని సినీ పండితులు అంటున్నారు.