పూరీ కడిగిన ముత్యంలా బయటపడతాడు : బండ్ల గణేష్
హైదరాబాద్ వెలుగు చూసిన మత్తుమందు దందాలో సిట్ అధికారుల ముందు హాజరై విచారణ ఎదుర్కొన్న టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు అంతకంతకు మద్దతు పెరుగుతోంది. తాజాగా నిర్మాత బండ్ల గణేష్ ఆయనకు అండగా నిలిచారు. డ్ర
హైదరాబాద్ వెలుగు చూసిన మత్తుమందు దందాలో సిట్ అధికారుల ముందు హాజరై విచారణ ఎదుర్కొన్న టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు అంతకంతకు మద్దతు పెరుగుతోంది. తాజాగా నిర్మాత బండ్ల గణేష్ ఆయనకు అండగా నిలిచారు. డ్రగ్స్ ఆరోపణల నుంచి పూరీ జగన్నాథ్ కడిగిన ముత్యంలా బయటపడతారంటూ వ్యాఖ్యానించారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ తనకు పూరీ జగన్నాథ్‌తో చాలా కాలంగా పరిచయం ఉందని, అతను చాలా మంచి వ్యక్తి అని చెప్పాడు. డ్రగ్స్ కేసులో వస్తున్న ఆరోపణల గురించి తనకు తెలియదని, కానీ ఇలాంటి ఆరోపణల తర్వాత తిరిగి మళ్లీ సినిమాలు చేసేంత ఏకాగ్రత ఉండదని బండ్ల గణేష్ చెప్పాడు. ఏదిఏమైనా పూరీ ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటపడతాడని, ఓ మంచి బ్లాక్‌బస్టర్‌ను అందిస్తాడని బండ్ల గణేష్ ఆశాభావం వ్యక్తం చేశాడు.