శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: గురువారం, 30 మార్చి 2017 (17:00 IST)

'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'లో అక్షయ్ కుమార్...? చిరంజీవి సినిమా తట్టుకుంటుందా?

రోబో 2 చిత్రంలో 12 గెటప్పులతో అదరగొట్టబోతున్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఎందుకనో దక్షిణాది చిత్రాల్లో నటించాలన్న ఆసక్తి తనకు ఎక్కువైపోయిందని అంటున్నారు. రజినీకాంత్ చిత్రంలో షాకింగ్ గెటప్స్ చూసుకున్న తర్వాత దక్షిణాదిలో నటించాలన్న ఆసక్తి మరింత

రోబో 2 చిత్రంలో 12 గెటప్పులతో అదరగొట్టబోతున్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఎందుకనో దక్షిణాది చిత్రాల్లో నటించాలన్న ఆసక్తి తనకు ఎక్కువైపోయిందని అంటున్నారు. రజినీకాంత్ చిత్రంలో షాకింగ్ గెటప్స్ చూసుకున్న తర్వాత దక్షిణాదిలో నటించాలన్న ఆసక్తి మరింత ఎక్కువైపోయిందట. అందుకే స్టార్ హీరోలుగా వున్నవారందరితో టచ్ లో వుంటున్నారట. 
 
ఈమధ్యనే ఖైదీ నెం.150తో సూపర్ హిట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రంలో తను నటిస్తానంటూ అడిగారట. దీనితో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంలో అక్షయ్ కుమార్ ఓ కీలక పాత్ర వేయబోతున్నాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్షయ్ కుమార్ కు రెమ్యునరేషన్ కింద బాలీవుడ్లో రూ. 50 కోట్లు ఇస్తున్నట్లు సమాచారం. 
 
ఆ లెక్కలో చూస్తే ఆయన పారితోషికం కిందే 50 కోట్లు పోతే చిరంజీవి పారితోషికం, హీరోయిన్ పారితోషం... ఇంకా సినిమా పూర్తి చేయడానికి.... ఇలా అనేక లెక్కలున్నాయి. ఈ లెక్కన చూస్తే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం కనీసం 200 కోట్ల రూపాయల బడ్జెట్టుతో రూపొందిస్తేనే సరిపోతుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఐనా... అంత బడ్జెట్టును చిరంజీవి సినిమా తట్టుకుంటుందా అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. అక్షయ్ కుమార్ వున్నాడు కనుక హిందీలో కూడా మార్కెట్ చేసుకోవచ్చేమో...?