సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : మంగళవారం, 10 జనవరి 2017 (14:59 IST)

'ఖైదీ నంబర్ 150' సంచలనాలు.. హైదరాబాద్ ఐమ్యాక్స్‌ బ్లాకైపోయింది... ఎందుకో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150" విడుదలకు ముందే సంచనాలు నమోదు చేస్తోంది. సుమారు ఎనిమిది సంవత్సరాల తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తున్న చిరంజీవికి టాలీవుడ్‌లో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదనీ ఇ

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150" విడుదలకు ముందే సంచనాలు నమోదు చేస్తోంది. సుమారు ఎనిమిది సంవత్సరాల తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తున్న చిరంజీవికి టాలీవుడ్‌లో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదనీ ఇటీవల గుంటూరులో జరిగిన ఆ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్‌తో నిరూపితమైంది. 
 
ఇపుడు.. హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్ థియేటర్ బ్లాక్ అయిపోయింది. ఇందులో తొలిరోజు ప్రదర్శించనున్న అన్ని ఆటలకు టిక్కెట్లు హాట్ కేకుల్లో అమ్ముడు పోయాయి. పైగా, రికార్డు స్థాయిలో ఎన్నడూలేనంతగా ఐమ్యాక్స్‌లో 'ఖైదీ నంబర్ 150' చిత్రాన్ని 30 ఆటలకు పైగా వేస్తున్నారు. 
 
దీంతో ఈ ఆటలకు సంబంధించిన అన్ని టిక్కెట్లు ఆన్‌లైన్‌లో బుక్ అయిపోయాయి. బుకింగ్ ఓపెన్ చేసిన గంటలనే మొత్తం టిక్కెట్లు అమ్ముడైపోయాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఐమ్యాక్స్‌లో మొదటిరోజు అన్ని షోలను కేవలం ఖైదీ కోసమే కేటాయించారు. 11వ తేదీ తెల్లవారుజాము నుంచి మిడ్‌నైట్ వరకూ షోలన్నీ ఖైదీ షోలనే ప్రదర్శించనున్నారు. 
 
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్లన్నింటా తొలిరోజు ఆరు షోలు వేసేలా ప్లాన్ చేసినట్టు సమాచారం. 'ఖైదీ నంబర్ 150' సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్‌కి వస్తోంది. వారం టు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు సైతం దొరకని పరిస్థితి. ముఖ్యంగా బుకింగ్ ఓపెన్ అయిన గంట లోపే ఆన్‌లైన్ హాట్‌కేకుల్లా అమ్ముడుపోతుండటం గమనార్హం.