బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By DV
Last Modified: సోమవారం, 23 జనవరి 2017 (22:23 IST)

ఇల్లు మారినా ఫేట్‌ మారలేదు... బ్రహ్మి తిప్పలు....

హాస్య నటుడు బ్రహ్మానందం ఎప్పుడూ హాట్‌ టాపికే... కెరీర్‌ మంచి రైజింగ్‌లో వుండగానే దర్శకనిర్మాతలకు చుక్కలు చూపించాడనే విమర్శలు బోల్డుగా వున్నాయి. తర్వాత క్రమేణా.. అవకాశాలు తగ్గాయి. దీంతో కాలం కలసి రాలేదని భావిస్తున్నాడు. తాజాగా మణికొండలో నివాశముంటున్నా

హాస్య నటుడు బ్రహ్మానందం ఎప్పుడూ హాట్‌ టాపికే... కెరీర్‌ మంచి రైజింగ్‌లో వుండగానే దర్శకనిర్మాతలకు చుక్కలు చూపించాడనే విమర్శలు బోల్డుగా వున్నాయి. తర్వాత క్రమేణా.. అవకాశాలు తగ్గాయి. దీంతో కాలం కలసి రాలేదని భావిస్తున్నాడు. తాజాగా మణికొండలో నివాశముంటున్నాడు. 
 
గతంలో జూబ్లీహిల్స్‌లో వుండేవారు. క్రమేణా అక్కడేదో వాస్తు దోషం వుందని భావించి అక్కడ నుంచి మణికొండ వచ్చాడు. వచ్చాక.. కొన్నాళ్ళు కెరీర్‌ బాగున్నా.... మరలా మందగించేసరికి పాత ఇంటికే వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. మరి పాత ఇంటికి వచ్చినా.. బ్రహ్మీ జాతకం మారుతుందో లేదో చూడాలి.