గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 ఆగస్టు 2023 (15:41 IST)

ఆ విషయంలో మహేష్ బాబుతో పోటీ పడుతున్న జూనియర్ ఎన్టీఆర్?

NTR_Mahesh Babu
NTR_Mahesh Babu
"ఆర్ఆర్ఆర్" ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించిన తర్వాత ఎన్టీఆర్ స్థాయి పెరిగింది. అతని బ్రాండ్ విలువ పెరిగింది. అతను గతంలో కంటే ఎక్కువ కార్పొరేట్ బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా మారిపోయారు. ఇటీవల మెక్‌డొనాల్డ్స్ ఇండియా వంటి బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా చేశారు. తాజాగా ఆయన చేతిలో మరో రెండు బ్రాండ్‌లను సొంతం చేసుకున్నారు. 
 
దీంతో బ్రాండ్ అంబాసిడర్స్ ద్వారా ఎన్టీఆర్ త్వరలో మహేష్ బాబుతో పోటీ పడనున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సెలబ్రిటీ బ్రాండ్ అంబాసిడర్. ప్రస్తుతం ఈయనకు పోటీగా ఎన్టీఆర్ మారిపోయారు. 
 
మరోవైపు ఎన్టీఆర్ కూడా "దేవర" చిత్రీకరణలో భాగమయ్యారు. నాన్‌స్టాప్‌గా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్‌లకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 
 
అయితే ఎన్టీఆర్ యాడ్ షూట్‌లో పాల్గొనాల్సిన అవసరం వచ్చినప్పుడు షూటింగ్‌కు ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే సెలవు తీసుకుంటారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.